విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష కార్మిక కర్షక సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని వారు నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్‌పరం చేయడాని సీపీఎం అడ్డుకుంటుందని ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు స్పష్టం చేశారు.