ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్​ బాధితులకు న్యాయం చేయండి: సీఐటీయూ - LG polymers victims news

విశాఖ మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్​ బాధితులకు మద్దతుగా ఆందోళన చేశారు.

protest of citu leaders
సీఐటీయూ నాయకుల నిరసన

By

Published : May 7, 2021, 7:56 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్​ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ నాయకులు నిరసన చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. గ్యాస్​ లీకేజీ ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా.. పలువురికి పరిహారం అందలేదన్నారు. ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని మండిపడ్డారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవటం సిగ్గుచేటని అన్నారు. బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కేఆర్​ కుమార్ మంగళం, నగర అధ్యక్షుడు ఆర్​కెఎస్ రవికుమార్, కార్యదర్శి బి.జగన్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details