ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

STEEL PLANT : స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తాజా వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... కార్మిక సంఘాల నేతలు మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 10కి.మీల మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి.

విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమ

By

Published : Aug 29, 2021, 11:09 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఉక్కు ఉద్యమం 200 రోజుల సందర్భంగా విశాఖలో మానవహారం చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 కిలో మీటర్లు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల కుటుంబాలు, నగరవాసులు పాల్గొన్నారు. లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం కావాలనే... నష్టాల బాటలో నడుపుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details