సామాన్య జనంపై పన్నుల భారం వేసే విధంగా తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్ట సవరణలను సమైక్యంగా వ్యతిరేకించాలని.. ఆంధ్రప్రదేశ్ అర్బన్ పౌర సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబూరావు పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణలపై విశాఖ పౌర గ్రంథాలయం, వార్వ నివాస్ సంస్థలు సంయుక్తంగా సదస్సును నిర్వహించాయి. సదస్సులో నూతన మున్సిపల్ చట్ట సవరణలను నిరసిస్తూ ప్రతులను ప్రతినిధులు చింపేశారు. ఆస్తి విలువ పై ఇంటి పన్ను వేసే విధానం రద్దు చేయాలని.. మంచినీరు, డ్రైనేజీ, చెత్త పన్నులు వేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. పౌర సేవలను ప్రైవేటీకరించే విధానాలను అందరూ కలిసి ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెను భారాన్ని మోపే విధంగా తెచ్చిన పట్టణ సంస్కరణలను.. కేంద్రానికి లొంగిపోయిన వైకాపా ప్రభుత్వం శాసనసభలో ఏకపక్షంగా.. మున్సిపల్ చట్టాలను మార్చి ప్రజలపై మరింత భారం మోపేందుకు పూనుకుందని బాబురావు మండిపడ్డారు. సదస్సులో నివాస్ ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు.