ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

REGISTRATIONS: ఏ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ ఆ గ్రామాల సచివాలయాల్లోనే..

ఆస్తుల రిజస్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన విధానం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆస్తుల రిజస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. నకిలీ చలాన్లతో అక్రమాలు.. ఒకే ఆస్తికి డబుల్ రిజిస్ట్రేషన్లు వంటి వివాదాలు తలెత్తుతున్న పరిస్థితుల్లో.. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒకింత కష్టతరమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

REGISTRATIONS
REGISTRATIONS

By

Published : Oct 3, 2021, 12:20 PM IST

Updated : Oct 4, 2021, 8:23 PM IST

ఏ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ ఆ గ్రామాల సచివాలయాల్లోనే..

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల పౌర సేవలు అందించటంలో భాగంగా.. ఆస్తుల రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల కోసం మండల, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. ప్రస్తుత విధానంతో సొంత ఊళ్లోనే ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సర్కారు చెబుతోంది. తొలిదశలో రాష్ట్రంలోని 51 సచివాలయాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. భూముల రీసర్వే పూర్తయిన 51 గ్రామాల్లోని సచివాలయాలను ఎంపిక చేశారు. సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇప్పటికే మొదలైంది.

'' ప్రభుత్వం సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు అందిచాలనుకుంది. దీనిని గాంధీజయంతి నుంచి అమలులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. ముందుగా కొన్ని కేంద్రాల్లోని సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. సచివాలయ సిబ్బందికి అందుకు అవసరమైన మెళకువలు నేర్పుతున్నాం. ఏ ఏ డాక్యుమెంట్లు పరిశీలించాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాం.'' - నాగిరెడ్డి, ఉద్యోగి.

రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు తావు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారదర్శకత కోసం రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్కాన్ చేసి, వారి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లకు మొదట పంపించాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ వాటిని తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాకే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు కోసం చలానాలు తీసేందుకు బీ ఫేసింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టి.. వివాదాలు పరిష్కరించిన తర్వాతే.. రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. సచివాలయాల్లో సంబంధిత గ్రామానికి సంబంధించిన ఆస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

ఇదీ చదవండి:GMC MEETING: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాటల యుద్ధం

Last Updated : Oct 4, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details