ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేజీహెచ్​ సూపరింటెండెంట్​గా డాక్టర్​ మైథిలి బాధ్యతలు స్వీకరణ - visakha kgh latest news

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండెంట్​గా సర్జరీ విభాగం ప్రొఫెసర్​ డాక్టర్​ పి. మైథిలి పూర్తి అదనపు బాధ్యతలు ( ఎఫ్​ఏసి) ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకు సూపరింటెండెంట్​ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్​ డాక్టర్​ పి.వి. సుధాకర్​ ఇకపై ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఉత్తర్వులు వెలవడిన వెంటనే డాక్టర్​ మైథిలి బాధ్యతలు స్వీకరించారు.

professor doctor mythili takes charge
ప్రొఫెసర్​ డాక్టర్​ పి. మైథిలి

By

Published : Oct 9, 2020, 10:11 AM IST

కేజీహెచ్​ పర్యవేక్షక వైద్యాధికారిగా సర్జరీ విభాగ ప్రొఫెసర్​ డాక్టర్​ పి. మైథిలి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా కొనసాగిన ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్​ డాక్టర్​ పి.వి. సుధాకర్​ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్​ ఉస్మానియా ఆసుపత్రి ఉప పర్యవేక్షక వైద్యాధికారి. ప్రొఫెసరుగా సుదీర్ఘకాలం సేవలందించిన ఈమె రాష్ట్ర విభజన తర్వాత కేజీహెచ్​ సర్జరీ విభాగ ప్రొఫెసరుగా 2014లో బాధ్యతలు చేపట్టారు.

కేజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా బాధ్యతలు నిర్వహించి జూలై 31న డాక్టర్​ జి. అర్జున ఉద్యోగ విరమణ చేశారు. అప్పటినుంచి డాక్టర్​ సుధాకర్​ ఇన్​ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థానంలో ఈమెను నియమిస్తూ గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు బాధ్యతలు చేపట్టారు.

ఆసుపత్రిలో వివిధ అంశాలపై అవగాహన ఏర్పరచుకొని రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని డాక్టర్​ మైథిలి తెలిపారు. ఈమె ఎన్టీఆర్​ హెల్త్​ వర్శిటీ వీసీ డాక్టర్​ శ్యామ్​ప్రసాద్​కు చెల్లెలు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేజీహెచ్​ పరిపాలన విభాగ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు, పరిపాలనాధికారి జోగిరాజు, మేనేజరు టీ. శేషేంద్రశర్మ తదితరులు పాల్గొని కొత్త సూపరింటెండెంట్​ను అభినందించారు.

ఇదీ చదవండి :

విశాఖ కేజీహెచ్​లో కొవిషీల్డ్ మానవ ప్రయోగాలు

ABOUT THE AUTHOR

...view details