ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధ్యయన యాత్రకు వెళ్లిన కార్పొరేటర్లకు అనుకోని చిక్కులు - జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం

GVMC విశాఖ నుంచి అధ్యయన యాత్రకు వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం అనుకోని అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొండచరియలు విరిగిపడి మనాలి-చండీగఢ్‌ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడం వల్ల అర్ధరాత్రి నుంచి బస్సులోనే కార్పొరేటర్లు ఇబ్బందులు పడ్డారు. మనాలిలోనే బసకు ఏర్పాట్లు చేయాలని బృందం కోరింది. హిమాచల్‌ప్రదేశ్, మనాలి యాత్ర ముగించి చండీగఢ్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

GVMC
జీవీఎంసీ కార్పొరేటర్ల బృందానికి ఇబ్బందులు

By

Published : Aug 20, 2022, 10:14 AM IST

GVMC ఉత్తర భారతదేశంలో అధ్యయన యాత్రకు వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్ల బృందానికి.. అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో యాత్ర ముగించుకున్న బృందం.. చండీగఢ్‌కు వెళ్తుండగా... కొండచరియలు విరిగిపడి రహదారిపై రాకపోకలు నిలిచాయి. అర్ధరాత్రి నుంచి బస్సులోనే మనాలి సమీప రహదారిలో కార్పొరేటర్లు అవస్థలు పడ్డారు. మనాలిలోనే బసకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ల బృందం కోరింది. కాగా... ప్రయాణం కొనసాగించాలని జీవీఎంసీ అధికారులు పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో జీవీఎంసీ అధికారుల తీరుపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 81 మంది కార్పొరేటర్లు, 14 మంది సిబ్బంది కూడిన బృందం... అధ్యయన యాత్రకు మనాలి వెళ్లింది. రెండు బస్సుల్లో కార్పొరేటర్లు... మనాలి నుంచి చండీగఢ్‌కు బయల్దేరారు. డిప్యూటీ మేయర్‌ జియ్యని శ్రీధర్‌, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, జనసేన ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి, సీపీఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్‌... పర్యటనలో ఉన్నారు. మనాలి యాత్ర పూర్తిచేసుకుని.. నేడు చండీగఢ్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details