Pregnant womens: విశాఖపట్నం ఘోషా ఆసుపత్రి(విక్టోరియా)లో సరైన సౌకర్యాలు లేక గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వైద్యం కోసం వచ్చే మహిళలు.. గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. విశ్రాంత హాళ్లలో సరిపడా కుర్చీలు కూడా లేవు. ఉన్న కొన్నింట్లో.. సగం విరిగిపోయాయి. ఫ్యాన్లు లేని రేకుల షెడ్లలో ఎండలకు చెమటలు కక్కుతూ కూర్చోలేక, నిల్చోలేక కాబోయే అమ్మలు కష్టపడుతున్నారు. కొందరు సమీపంలోని చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రే అయినా.. సౌకర్యాలే లేవని మహిళలు పెదవి విరుస్తున్నారు.
కనీస సౌకర్యాలు లేక.. గర్భిణీల 'ఘోష'! - ఏపీ తాజా వార్తలు
Pregnant womens: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కరవవుతున్నాయి. దీంతో.. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గర్భిణులైతే కడుపులో బిడ్డను మోస్తూ కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక ఆపసోపాలు పడుతున్నారు. విశాఖలోని ఘోషా ఆస్పత్రిలోని పరిస్థితే ఇందుకు అద్దం పడుతున్నాయి.
గర్భిణుల ఇక్కట్లు