ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజారోగ్యంపై విశాఖ కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమీక్ష నిర్వహించారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. మన్యంలో పీహెచ్సీలు నిరంతరాయంగా పని చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రగ్ స్టోరేజీలను మన్యంలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున మధ్యాహ్నం 11గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
వేసవి కార్యాచరణకు అధికారులను అప్రమత్తం చేసిన పూనం మాలకొండయ్య - phc
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలను విశాఖ కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమీక్ష నిర్వహించారు.
వేసవి కార్యాచరణకు అధికారులను అప్రమత్తం చేసిన పూనం మాలకొండయ్య