కరోనా ఎఫెక్ట్ : విశాఖ పోర్టులో ముందస్తు జాగ్రత్తలు - carona virus latest news in vizag
కరోనా వ్యాప్తి నివారించేందుకు విశాఖ పోర్టులో అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు తెలిపారు. పూర్తి తనిఖీ తర్వాతే అన్లోడింగ్కి అనుమతిస్తున్నామన్నారు. నౌకలో వచ్చే సిబ్బందికి వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్ : విశాఖ పోర్టులో ముందస్తు జాగ్రత్తలు
విశాఖ పోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నౌకల అన్లోడింగ్కి అనుమతిస్తున్నామని విశాఖ పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విదేశీ నౌకల్లో వచ్చే సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నౌకలో సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో దిగేందుకు అనుమతించడం లేదని స్పష్టం చేశారు. విశాఖ పోర్టులో తీసుకుంటున్న చర్యలపై విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రామ్మోహనరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!