విశాఖ జిల్లాలో సముద్రతీరం వెంబడి వెనుక జలాలను(బ్యాక్ వాటర్) ఉపయోగించి సాగు చేస్తున్న రొయ్యల చెరువులకు రిజిస్ట్రేషన్‌తో పాటు లైసెన్స్ మత్స్యశాఖ తప్పనిసరి చేసింది. ఆక్వా జోనేషన్ పరిధిలో ఉన్న చెరువులకు చెన్నై కోస్టల్ ఆక్వా కల్చర్ నుంచి లైసెన్స్ తీసుకోవాలని సూచించింది. జిల్లాలో పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో 688 హెక్టార్లలో లైసెన్స్ లేని, రిజిస్టర్ కాని చెరువులు ఉన్నాయి. వీటి పరిశీలనకు మండల స్థాయి కమిటీలను వేశారు.
తీరం వెంబడి రొయ్యల చెరువులకు లైసెన్స్ తప్పనిసరి - రొయ్యల చెరువులు సాగు లైసెన్స్ న్యూస్
విశాఖ జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఉన్న వెనుక జలాలతో సాగుచేస్తున్న రొయ్యల చెరువులకు రిజిస్ట్రేషన్‌తో పాటు లైసెన్స్ తప్పనిసరి చేసింది మత్స్యశాఖ. ఆక్వా జోనేషన్ పరిధిలో ఉన్న చెరువులకు చెన్నై కోస్టల్ ఆక్వా కల్చర్ నుంచి లైసెన్స్ తీసుకోవాలని సూచించింది. లైసెన్స్ కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మత్స్యశాఖ జేడీ ఫణిప్రకాష్ తెలిపారు.
prawn ponds
లైసెన్స్ కోసం రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు మత్స్యశాఖ జేడీ ఫణిప్రకాష్ తెలిపారు. లైసెన్స్ లేకపోయినా, పునరుద్ధరించుకోకపోయినా రైతులకు మత్స్యశాఖ నుంచి ఎటువంటి పథకాలు వర్తించవని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి :లబ్ధిదారులకు నచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్