కొవిడ్-19 సహాయక చర్యల్లో భాగంగా ఎంపీ విజయసాయి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న 'ప్రగతి భారత్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో 7,500 పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. మొదట ఎక్కువ కేసులు విశాఖలో వచ్చాయని... ఈ సమయంలో సేవలు అందిస్తున్న విశాఖ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. రెండో విడతలో పోలీస్, వార్డు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు ప్రకటించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు లెక్క చేయకుండా పని చేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వేల కట్టలేనివని విజయసాయి రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు అండగా 'ప్రగతి భారత్ ఫౌండేషన్'
విశాఖలో 7,500 పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు చెప్పారు. రెండో విడతలో పోలీస్, వార్డు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లతో పాటు సరుకులు తమ ట్రస్ట్ తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు.
7500 పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ