తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్రబహుదూర్ సింగ్తో విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు భేటీ అయ్యారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో వీరివురు పలు అంశాలపై చర్చించారు. విశాఖ సహజ నౌకాశ్రయం తొలి నాళ్లలో ఎదిగిన తీరు, దానికి నావికాదళం సహకరించిన అంశాలను గుర్తు చేసుకున్నారు.
విశాఖ పోర్టుకు రక్షణ పరంగా, అభివృద్ధి పరంగా తూర్పు నౌకాదళం ఎంతో అండగా ఉంటోందని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు వ్యాఖ్యానించారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదిగేందుకు సవాళ్లను ఎదుర్కోవడానికి సమకూరిన మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది.