సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ రద్దీగా మారింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం అదనపు బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. వాటి వివరాలను సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పలాస ఇచ్ఛాపురానికి ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, రాజమండ్రి, కాకినాడలకు ప్రతి పావుగంటకు ఒక బస్ ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పండుగకు వెళ్లేందుకు... ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ సుధా బిందు తెలిపారు.
విశాఖలో సంక్రాంతి రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు..! - విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ తాజా
సంక్రాంతి ప్రయాణికులతో విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. రద్దీకి అనుగుణంగా అప్పటికపుడు సర్వీసులను అధికారులు నడుపుతున్నారు. ఒక్క విశాఖ నుంచి అదనంగా రోజుకు 200 సర్వీసులు తిరుగుతున్నాయి. ప్రయాణికులు తమ సొంత ఊళ్లకు సౌకర్యవంతంగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ సుధా బిందుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
కిటకిటలాడుతోన్న ద్వారకా... రద్దీకనుగుణంగా సర్వీసులు