ఏప్రిల్ 12న పాలిసెట్ - schedule
ఏప్రిల్ 12న 2019సంవత్సర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2019 ప్రణాళికను మంత్రి గంటా విశాఖలో విడుదల చేశారు. ఏప్రిల్ 12న పాలిసెట్ను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్వహిస్తోందని చెప్పారు. లక్షా 29వేల 412 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్లో జరుపుతామని తెలిపారు.దేశంలోనే విద్యారంగానికి ఏటా 25 వేల కోట్లు ఖర్చు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే విజయనగరం, ప్రకాశం జిల్లాకూవిశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అర్హత మార్కులు తగ్గింపు
దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అన్ని ప్రముఖ దిన పత్రికలో ఒకటి ,రెండు రోజుల్లో ప్రకటించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష అర్హత మార్కులు 30 శాతం నుంచి 25 శాతం తగ్గించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది