ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆపరేషన్ పరివర్తన'.. క్షుణ్ణంగా వాహనాల తనిఖీ - గంజాయి పట్టివేతకు ప్రత్యేక తనిఖీలు

గంజాయి అక్రమ రవాణా, సాగును అరికట్టేందుకు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ గౌతమి తెలిపారు. విశాఖ నగరంలోకి ప్రవేశించే, వెళ్లే వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

ఆపరేషన్ పరివర్తన
ఆపరేషన్ పరివర్తన

By

Published : Nov 7, 2021, 10:03 PM IST

'ఆపరేషన్ పరివర్తన'లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టామని విశాఖ నగర శాంతిభద్రతల డీసీపీ గౌతమి సాలి తెలిపారు. విశాఖ రామాటాకీస్ కూడలిలో చేపట్టిన వాహన తనిఖీలను డీసీపీ గౌతమి సాలి, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్​కుమార్​లు పర్యవేక్షించారు. నగరంలోకి ప్రవేశిస్తున్న, నగరం నుంచి జాతీయ రహదారిపైకి వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు.

ఈ మధ్య కాలంలో గంజాయి రవాణా ఎక్కువగా ఉందని.. రూరల్ ఏరియాల్లో భారీగా గంజాయి పట్టుబడుతోందని డీసీపీ అన్నారు. నగర పరిధిలో హోటళ్లు, లాడ్జిల్లో, వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన రెండు వారాల్లో 310 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 'మార్పు' అనే కార్యక్రమం ద్వారా గంజాయికి బానిసైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో గంజాయి తోటలను ఇప్పటికే ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. రూరల్ ప్రాంతంలో 185 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడిందని.. ప్రత్యేక తనిఖీల ద్వారా గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని వివరించారు.

ఇదీ చదవండి:కేరళకు తరలిస్తున్న గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details