Psycho Killer Arrest విశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్ రాంబాబును అరెస్టు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్ తెలిపారు. వారం రోజుల్లో మూడు హత్యలు చేసిన రాంబాబు అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. 2018లో రాంబాబు భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడని వివరించారు. రాంబాబుకు కూతురు (26) కొడుకు (27) ఉన్నారని..ఇద్దరూ తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదని తెలిపారు. అంతేకాక రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా పని చేస్తున్న సమయంలో యాజమాని చేతిలో మోసపోయాడని తెలిపారు. అప్పటినుంచి మహిళల మీద కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు.
"ఈ నెల 8న వృద్ధ దంపతులను, 15న మరో మహిళను చంపాడు. భార్యతో విడాకులు తీసుకున్నాడు, పిల్లలు దగ్గరకు రానివ్వడం లేదు. కుటుంబానికి దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. ఆడవాళ్లను చంపేయాలన్నదే రాంబాబు ప్రధాన ఉద్దేశం. రాంబాబు వద్ద సెల్ఫోన్ లేకపోవడం వల్ల పట్టుకోవడం కష్టమైంది. నిందితుడు ఆలయాలు, ఫంక్షన్ హాళ్లలో తింటూ కాలక్షేపం చేస్తున్నాడు."- సీపీ శ్రీకాంత్