కొవిడ్ కష్ట కాలంలో అత్యవసర వైద్య సేవలందిచిన తమను ఆదుకోవాలంటూ... విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం అడారిమెట్టలో వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కారును అడ్డుకుని నిరసన చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవరిస్తూ... ఈడ్చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన కొవిడ్ వైద్య సిబ్బంది... తమ పట్లు పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇలా ప్రవర్తిస్తారా అని వాపోయారు.
సమస్యలు చెప్పుకుందామని వస్తే... కొవిడ్ సిబ్బందిని తోసేశారు... - vizag district crime news updates
విశాఖపట్నం జిల్లా అడారిమెట్టలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కారును అడ్డుకున్న కొవిడ్ వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లా అడారిమెట్టలో పోలీసులు అత్యుత్సాహం