విశాఖ ఘటనపై కేసులు నమోదు చేయని పోలీసులు - విశాఖలో చంద్రబాబు అరెస్టు న్యూస్
విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటనలపై పోలీసులు ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిరసనకారులు 5 గంటలపాటు అడ్డుకున్నారు. వైకాపా కార్యకర్తల ఆందోళనలతో వాహనంలోనే చంద్రబాబు 5 గంటలపాటు వేచి ఉన్నారు. చంద్రబాబుకు రక్షణగా నిలిచిన తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులు చేశాయి. చంద్రబాబు వాహనంపైనా ఆందోళనకారులు దాడి చేసేందుకు యత్నించారు.

police on vishaka protest