పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు... విశాఖ నగర పోలీసులు, జర్నలిస్టులు క్రికెట్ ఆడారు. మధురవాడలోని ఏసీఏ-వీడీసీఏ బి-గ్రౌండ్ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో... పోలీసులు, జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా పాల్గొని అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపారు.
జర్నలిస్టులకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపరిచే ఉద్దేశంతో... ఈ పోటీలు నిర్వహించినట్లు కమిషనర్ చెప్పారు. మొదట బ్యాటింగ్ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టుల టీం... 15 ఓవర్లలో 94 పరుగులు చేయగా... సిటీ పోలీస్ బృందం హోరాహోరీగా బ్యాటింగ్ చేసి... 94 పరుగులతో మ్యాచ్ను డ్రా చేసింది. ఫలితంగా మళ్లీ సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడారు. ఈ సూపర్ ఓవర్లో స్పోర్ట్స్ జర్నలిస్టులు విజయం సాధించారు. విజేతగా నిలిచిన స్పోర్ట్స్ జర్నలిస్టు టీంకు నగర పోలీస్ కమిషనర్ ట్రోఫీ అందజేశారు.