విశాఖ జిల్లా కసింకోట మండలం గొబ్బూరు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా.. 540 కేజీల గంజాయి పట్టుబడింది. డ్రైవర్ గణేశ్‌ని అదుపులోకి తీసుకొని.. వివరాలు సేకరించినట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
భారీగా గంజాయి పట్టివేత.. - gannja seized at Gobbur Junction
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి.. 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి.