విశాఖలో పోలీసులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్లో వాస్తవం లేదంటూ పోలీసులు తెలిపారు. శుక్రవారం వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీలో భాగంగా నిరసనకారులను అడ్డుకునే క్రమంలో ఆటో తగిలి కింద పడిపోయానని ఆరిలోవ పోలీసు స్టేషన్ సీఐ ఇమ్మాన్యుల్ రాజు తెలిపారు. ఆ సమయంలో నిరసనకారుడు రమేష్ వచ్చి తనకు సహాయం చేశాడన్నారు. కానీ కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయటాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనపై ఫొటోలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇటువంటి చర్యల వల్ల పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్ అవాస్తవం'
విశాఖలో పోలీసులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌పై పోలీసులు స్పందించారు. ఆటో తగిలి కింద పడిపోయిన తమకు రమేష్ అనే నిరసనకారుడు సాయం చేశాడని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేయటం సరికాదన్నారు. ఈ ఘటనపై ఫొటోలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు.
chandrababu-tweet-over-vishaka-incident