ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Robbery case: ఆస్పత్రిలో చోరీ.. నిందితుడు అరెస్ట్​

ఈ నెల 9న విశాఖ కంచరపాలెం పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో ఆ హాస్పిటల్ సహాయకుడిగా పనిచేసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు క్రైమ్ విభాగం ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు తెలిపారు.

By

Published : Aug 21, 2021, 10:00 PM IST

Published : Aug 21, 2021, 10:00 PM IST

theft case at hospital in Visakhapatnam
హాస్పిటల్​లో చోరీ

ఈ నెల 9న విశాఖ కంచరపాలెం పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో ఆ హాస్పిటల్ సహాయకునిగా పనిచేసిన రెడ్డి సత్తిబాబు అలియాస్ సతీశ్​ అనే వ్యక్తి.. ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని నుంచి రూ. 9 లక్షల 50 వేల నగదు, 2 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ విభాగం ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు తెలిపారు. మొత్తం రూ. 17 లక్షల నగదు చోరీ అయ్యిందని.. ఇంకా సొమ్మును రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు.

కేసులో ప్రధాన నిందితుడు సతీష్ తో పాటు.. అతని భార్య, అత్తామామల ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దోచుకున్న సొమ్ముతో ఇంటికి వచ్చిన భర్తను అనుమానించకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం, అత్తామామకు కొంత నగదును ఇవ్వడం జరిగినట్లు గుర్తించారు. దోచుకున్న సొమ్ముతో ఒక కారు కొన్నారు. భార్యభర్తలిద్దరికీ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉన్నందున నర్సీపట్నంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించాలని ప్రయత్నించినట్లు ఏడీసీపీ క్రైమ్ వేణుగోపాల్ నాయుడు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకున్న వెస్ట్ క్రైమ్ పోలీసులను ఏడీసీపీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details