Passport Service Centers విశాఖ, భీమవరం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రతి శనివారం పి.సి.సి.(పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు) సేవలు అందించడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవల విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు ఊపందుకున్నాయి.పి.సి.సి.ల కోసం పాస్‌పోర్ట్ కార్యాలయాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది 4002 పి.సి.సి.లు జారీ కాగా... ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 8,297 మంది పి.సి.సి.లు పొందారు. మరింతగా డిమాండుతోపాటు ముందస్తు అనుమతులు(స్లాట్లు) పొందడానికి పలువురు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతి శనివారం విశాఖ, భీమవరం పాస్‌పోర్ట్ కార్యాలయాలను తెరవాలని నిర్ణయించారు. ఆ రోజు పి.సి.సి. దరఖాస్తుదారులకు అవసరమైన సేవలనే అందించనున్నారు. ఆయా సేవలు కావాల్సిన వారు www.passportindia.gov.in లో ప్రతివారం గురువారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తు ప్రతులను, పాస్‌పోర్ట్, చిరునామా ధ్రువపత్రం, ఇతర ధ్రువపత్రాలను తీసుకుని శనివారం విశాఖ, భీమవరం పాస్‌పోర్ట్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ‘సెప్టెంబరు మూడో తేదీ నుంచి ప్రతి శనివారం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆమేరకు ఆన్‌లైన్లో గురువారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్న అంశాన్ని మాత్రం విస్మరించకూడదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏలూరు జిల్లా వరకు ఉన్నవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు’ అని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి (విశాఖపట్నం) విశ్వాంజలి గైక్వాడ్ తెలిపారు.
పాస్ పోర్ట్ సేవాకేంద్రాల్లో ప్రతి శనివారం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల సేవలు - ప్రతి శనివారం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు
Passport Service Centers ఇకపై విశాఖ, భీమవరం పాస్ పోర్ట్ సేవాకేంద్రాల్లో ప్రతి శనివారం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల సేవలు అందించడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు పాస్ పోర్ట్ అధికారులు తెలిపారు. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రతి శనివారం విశాఖ, భీమవరం పాస్ పోర్ట్ కార్యాలయాలను తెరవాలని నిర్ణయించామన్నారు. ఆ రోజు ప్రత్యేకంగా పాసుపోర్టు దరఖాస్తుదారులకు అవసరమైన సేవలు మాత్రమే అందించనున్నామన్నారు. ఆయా సేవలు కావాల్సిన వారు గురువారం సాయంత్రంలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
పాస్ పోర్ట్ సేవాకేంద్రాల్లో ప్రతి శనివారం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల సేవలు
"ఇటీవల పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది పోలీసు క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగం, చదువుకోసం వెళ్లేవారు ఉన్నారు. పి.సి.సి. దరఖాస్తుదారుల కోసం విశాఖ, భీమవరం ప్రాంతీయ పాసుపోర్టు కేంద్రాల్లో ప్రత్యేకంగా ప్రతి శనివారం సేవలు అందిస్తాం. సెప్టెంబర్ 3 నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి." -విశ్వాంజలి గైక్వాడ్, విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి
ఇవీ చదవండి: