ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ARREST: తన పక్కనుంచి వెళ్లాడని..ఆటోడ్రైవర్​ను ఏం చేశాడంటే..!

విశాఖ ఆరిలోవ అంబేడ్కర్ నగర్​లో రెండు రోజుల క్రితం జరిగిన ఆటో డ్రైవర్ రాంబాబు హత్య కేసును ఆరిలోవ పోలీసులు ఛేదించారు. విశాలాక్షి నగర్​కు చెందిన చేబ్రోలు రూపేష్ ఈ హత్యకు పాల్పడినట్లు ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

హత్య కేసు ఛేదన... వ్యక్తి అరెస్టు
హత్య కేసు ఛేదన... వ్యక్తి అరెస్టు

By

Published : Sep 8, 2021, 10:38 PM IST

ఈ నెల 6న విశాఖలోని అంబేడ్కర్ నగర్ సమీపంలో రూపేష్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో రూపేష్​ పక్క నుంచి రాంబాబు.. ఆటో నడిపాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన రూపేష్ తన వద్ద ఉన్న బటన్ నైఫ్​తో ఆటోడ్రైవర్ రాంబాబు ఛాతీలో గట్టిగా పొడిచి పరారయ్యాడు. కత్తి గాయంతో తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితిలో ఉన్న రాంబాబును స్థానికులు గుర్తించి, అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు.. రాంబాబును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో రాంబాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రూపేష్ ను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై గతంలో పలు కేసులున్నాయని తెలిపారు.

ఇదీచదవండి.

SP Malika Garg: చంద్రబాబు లేఖ దిగ్బ్రాంతికి గురి చేసింది : ప్రకాశం ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details