ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fake Stickers: వాహనాలపై ఫేక్​ స్టిక్కర్స్​..తనిఖీల్లో విస్తుపోయే నిజాలు! - వాహనాలకు ఫేక్ స్టిక్కర్లపై తనిఖీలు

ఎంపీ, ఎమ్మెల్యే, గౌట్ డ్యూటీ, డాక్టర్, పోలీస్, ప్రెస్, ఫారెస్ట్.. ఇలా రకరకాల పేర్లతో కూడిన స్టిక్కర్లు ఉన్న వాహనాలు నిత్యం రోడ్లపై దర్శనమిస్తూనే ఉంటాయి..! కానీ ఇదీ కాస్త ఇష్టారాజ్యంగా తయారైంది. కొందరూ వీటిని అడ్డం పెట్టుకొని.. అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. ఇలా స్టిక్కర్లు అతికించుకుని.. నిర్భీతిగా తిరుగుతున్నారు..! ఇందులో కొందరూ ఆయా రంగాలకు సంబంధంలేని వారు కూడా ఉండటం గమనార్హం. అయితే ఇటీవల కాలంలో విశాఖ నగరంలో ఇలా ఎక్కువగా కనిపిస్తుండటంతో.. నగర సీపీ మనీశ్ కుమార్ సిన్హా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక డ్రైవ్​ల పేరుతో తనిఖీలు చేపట్టారు.

fake stickers in visakha city
fake stickers in visakha city

By

Published : Sep 12, 2021, 4:30 PM IST

వాహనాలకు అంటించే స్టిక్కర్లపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా వాహనాల తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు నగర సీపీ మనీశ్ కుమార్ సిన్హా. ఫలితంగా గత రెండు రోజులుగా నగరంలో.. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ప్రతి కూడలిలో, కీలక ప్రాంతాల్లో నిఘా వేయడంతో.. ఆయా స్టిక్కర్లతో పలువురు కనిపించారు.

తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయా విభాగాలతో వారికి అసలు సంబంధం లేకున్నా వాహనాలపై పేర్లు రాసుకోవడాన్ని గుర్తించారు. అయితే మొదటి తప్పిదం కింద పరిగణించి, తీవ్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు. అనధికారికంగా ఆయా స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతున్నవారిలో పలువురు పోలీసు, మీడియా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులే అధికంగా ఉంటున్నట్లు తేలింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అయితే వారు ఎందుకు ఇలా వాడుతున్నారు..? ఇలాంటి వారిలో ఎవరిపైనైనా నేర చరిత్ర ఉందా.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అందరి వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి

తాలిబన్ల వింత రూల్స్: మహిళలు చదువుకోవచ్చు.. కానీ...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details