ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CORONA: కరోనా లక్షణాలున్న మావోయిస్టులకు సహకరిస్తాం: ఎస్పీ కృష్ణారావు - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ మన్యంలోని మావోయిస్టులు కరోనా లక్షణాలతో ఉన్న విషయం తమకు తెలుసని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. చికిత్స కోసం(TREATMENT) దగ్గరలోని పోలీసు స్టేషన్​ను సంప్రదించాలని ఆయన సూచించారు.

corona treatment to Maoists said by police
మావోలకు పోలీసుల పత్రికా ప్రకటన

By

Published : Jun 26, 2021, 8:13 PM IST

మన్యంలో మావోయిస్టులు కరోనా(CORONA) లక్షణాలతో సంచరిస్తున్నారనే సమాచారం తమ దగ్గర ఉందని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఐ మావోయిస్టు పార్టీ గాలికొండ, కోరుకొండ, పెదబయలు, మావోయిస్టు దళ సభ్యులు, మిలీషియా సభ్యులకు కరోనా సోకిందని పోలీసులు ప్రకటించారు. వారికి సరైన వైద్యం అందకపోవడంతో ఈ మధ్యకాలంలో మావోయిస్టులు చనిపోయారనే విషయాన్ని మావోయిస్టు పార్టీ ధ్రువీకరించిందని ఆయన అన్నారు. ఏజెన్సీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఒడిశా-ఆంధ్రా-చత్తీస్​గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు తిరగడం వల్ల.. పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం ఉందని.. ఆ ప్రాంతాల్లోని గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మన్నల్ని సంప్రదించండి..

కరోనా లక్షణాలతో మావోయిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే సమీప పోలీస్​స్టేషన్ ​లో సంప్రదించి చికిత్స(TREATMENT) పొందాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారికి పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ప్రకటించారు. మావోయిస్టు అగ్ర నాయకులు దీనిపై కొంచెం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details