Police Action on sound pollution: శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా అధిక ధ్వని కలిగించే సైలెన్సర్ వినియోగిస్తున్న ద్విచక్రవాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. విశాఖ మహా నగరంలో ఇటీవల కాలంలో ద్విచక్రవాహనాలకు కంపెనీలు అమర్చే సైలెన్సర్లను తీసేసి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తూ పలు ప్రాంతాల్లో అధిక శబ్దం కలిగిస్తూ నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ సుమారు 1200 ద్విచక్రవాహనాల సైలెన్సర్లను ఇవాళ బీచ్ రోడ్‌లోని పోలీస్ మెస్ వద్ద రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
సౌండ్ పెంచితే.. యాక్షన్ తప్పదు: విశాఖ పోలీసులు - police action against sound pollution
Bikes silencers Destroyed : తాము బైక్‌పై వెళ్తే అందరూ తమనే చూడాలనుకుంటుంది యూత్. అందుకు ద్విచక్రవాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగించి.. సౌండ్ విపరీతంగా వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టారు. అనేకచోట్ల తనిఖీలు చేపట్టి అలాంటి సైలెన్సర్లను తొలగించారు.. ఈరోజు వాటిని బీచ్‌రోడ్డులో రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు.
silencers