ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ సీఎం లేఖకు బదులివ్వండి: విశాఖ ఉక్కుపై ‘దీపం’కు పీఎంవో సూచన - ఏపీ సీఎం లేఖకు బదులివ్వండి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు తగిన జవాబివ్వాలని దీపం విభాగానికి ప్రధానమంత్రి కార్యాలయం సూచించింది. ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతూ  జగన్‌ ఇటీవల ప్రధానికి లేఖ రాశారు.

pmo reference
pmo reference

By

Published : Mar 22, 2021, 7:09 AM IST

Updated : Mar 22, 2021, 10:07 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు తగిన జవాబివ్వాలని దీపం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) విభాగానికి ప్రధానమంత్రి కార్యాలయం సూచించింది. ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతూ జగన్‌ ఇటీవల ప్రధానికి లేఖ రాశారు. దీన్ని దీపం విభాగానికి పంపి సీఎంకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు పీఎంవో పేర్కొంది.

వైజాగ్‌ స్టీల్‌పై సీఎం రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీఎంవో ఈ మేరకు స్పందించింది. అలాగే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై అధ్యయనం కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఇంతవరకు తుది నివేదిక రాలేదని కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..!

Last Updated : Mar 22, 2021, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details