PM Interaction with Bala Puraskar Recipients : ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పలుకరించారు. ఈ అవార్డులను అందుకున్నవారిలో విశాఖకు చెందిన నేవీ చిల్ట్రన్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వీర్ కాశ్యప్, సత్యసాయి విద్యావిహార్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ అమేయలు ఉన్నారు. కాశ్యప్ కి టెక్నాలజీలో ఈ అవార్డు వరించగా, అమేయ శాస్త్రీయ నృత్యం ఇతర అంశాలలో ఈ అవార్డు లభించింది. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని మోదీతో పురస్కారం గ్రహీతలిద్దరూ వీసీలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున వారికి ప్రధాని తరఫున పురస్కారాలను అందజేశారు. కాశ్యప్, అమేయలతో పాటుగా వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. 2021 సంవత్సరానికి దేశం మొత్తం నుంచి 32 మంది ఈ అవార్డుకు ఎంపియ్యారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సమావేశమయ్యారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PM Interaction with Bala Puraskar Recipients : బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్.... - రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలు 2021
PM Interaction with Bala Puraskar Recipients : ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పలుకరించారు. ఈ అవార్డులను అందుకున్నవారిలో విశాఖకు చెందిన నేవీ చిల్ట్రన్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వీర్ కాశ్యప్, సత్యసాయి విద్యావిహార్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ అమేయలు ఉన్నారు.
బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్....