సినీఫక్కీలో సీమ పందుల వ్యాన్‌ను ఎత్తుకెళ్లేందుకు కొందరు దుండగులు యత్నించారు. పోలీసులు వెంబడించడంతో పరారయ్యారు.
attack: బ్రీడింగ్ కోసం సీమ పందులు.. ఎత్తుకెళ్లేందుకు యత్నం - unknown persons attack on pigs van in vishaka
సీమ పందుల వ్యాన్‌పై గుర్తు తెలియని దుండగుల దాడి చేశారు. విశాఖలోని నక్కపల్లి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది.
నక్కపల్లి టోల్‌ప్లాజా
విశాఖ నక్కపల్లి టోల్‌ప్లాజా వద్ద సీమ పందులను తరలిస్తున్న వ్యాన్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. పోలీసు ఎస్కార్ట్‌తో వెళ్తున్న వ్యాన్‌ను అపహరించేందుకు యత్నించారు. డ్రైవర్‌ను గాయపరిచి వ్యాన్‌తో సహా తీసుకెళ్లాలని చూశారు. పోలీసులు వెంబడించడంతో.. అక్కడే వదిలి పరారయ్యారు. విజయనగరం నుంచి చెన్నైకి బ్రీడింగ్ కోసం ఈ సీమ పందులను వ్యాన్‌లో తరలిస్తున్నారు.
ఇదీ చదవండీ..'వైకాపా భవిష్యత్తు నాయకుడు లేని పార్టీ'