విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలో పనిచేసే సిబ్బందిని విశాఖ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆయా కంపెనీలు. విశాఖ నుంచి పార్వతీపురం కెమికల్ కంపెనీ మూడు బస్సులను పంపించింది. లాక్‌డౌన్ కారణంగా గత నెల 24నుంచి స్వస్థలంలో ఫార్మా కంపెనీలో పనిచేసే కొంతమంది సిబ్బంది ఉండిపోయారు. ప్రస్తుత తరుణంలో ఫార్మా కంపెనీలు పని చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రకటించడంతో.. దూర ప్రాంతాల్లో ఉన్న సిబ్బందిని విధులకు హాజరయ్యేలా చర్యలను చేపట్టారు. జిల్లాలో ఉన్న పలువురు సిబ్బందిని సొంత బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేపట్టారు.
స్వస్థలాల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకొస్తున్న ఫార్మా కంపెనీలు - ఫార్మా కంపెనీ తాజా వార్తలు
లాక్డౌన్తో స్వస్థలాల్లో ఉండిపోయిన ఫార్మా కంపెనీలో పనిచేసే సిబ్బంది విధులకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఫార్మా కంపెనీలు పని చేయాల్సిన అవసరం ఉన్నందున.. ఆయా కంపెనీలు సిబ్బందిని స్వస్థలాల నుంచి తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టాయి.
pharma-companies