ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్ర యూనివర్సిటీ మూల్యాంకనంపై హైకోర్టులో పిటిషన్ - ఆంధ్రయూనివర్సిటీ తాజా వార్తలు

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్ష పేపర్ల మూల్యాంకనలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. పిటిషనర్ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆంధ్రయూనివర్సిటీ
ఆంధ్రయూనివర్సిటీ

By

Published : Sep 24, 2020, 4:34 PM IST

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూల్యాంకనం, రీవాల్యూషన్​లో అవకతవకలు జరిగాయని ప్రణవ్ ప్రకాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. విశ్వవిద్యాలయంలో మూల్యాంకన అవకతవకలపై సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

పిటిషనర్ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ పిటిషన్​కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :చర్చిలో విగ్రహాలు ధ్వంసం.. పోలీసుల దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details