కరోనాతో స్థానిక ఎన్నికలు వద్దని గతంలో నిమ్మగడ్డ రమేశ్ అన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే లక్షలమంది చనిపోతారని నిమ్మగడ్డ వాదించారన్న అవంతి... ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల కరోనా కేసులు ఉన్నాయని వివరించారు. తన పదవీకాలం పూర్తవుతోందని ఎన్నికలు జరపాలనుకోవడం తప్పని హితవు పలికారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం: అవంతి - Avanthi srinivas comments on elections
వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తన పదవీకాలం పూర్తవుతోందని ఎన్నికలు జరపాలనుకోవడం తప్పని హితవు పలికారు.
మంత్రి అవంతి శ్రీనివాస్