విశాఖ ఉక్కు బాగుంటే ఎప్పటికైనా తమకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. తమ బతుకులు బాగుపడుతాయని అప్పుడు భూములు ఇచ్చామని.. ఇప్పుడు అమ్మేస్తామంటే చూస్తూ ఉరుకోబోమని విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. కేంద్రం దిగొచ్చి తమకు న్యాయం చేసే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. తమ భూములు తమకిచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి నివేదించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
మా భూములు మాకే కావాలి: విశాఖ ఉక్కు నిర్వాసితులు - విశాఖ ఉక్కు నిర్వాసితులు
విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చి ప్రస్తుతం నిర్వాసితులుగా మారిన వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇంతకుముందు పరిశ్రమ నెలకొల్పడానికి ఇచ్చిన భూములు తిరిగి తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మా భూములు మాకే కావాలి : విశాఖ ఉక్కు నిర్వాసితులు
Last Updated : Mar 13, 2021, 7:07 PM IST