Harsha Kumar on ap captial: విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నడూ రాజధానిని కోరుకోలేదని కాంగ్రెస్ సీనిరయ్ నేత హర్షకుమార్ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉద్యమించిన విశాఖ ప్రజలు రాజధాని కోసం చిన్న ఉద్యమం కూడా చేయలేదన్నారు. వైకాపా నేతలు కావాలనే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రాజీనామాలు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పడం లేదని, సీఎం ప్రోద్బలంతోనే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీపైనా స్పందించిన ఆయన, ప్రాంతీయవాదంతో విద్వేషాలు రెచ్చగొట్టిన కేసీఆర్.. జాతీయవాది ముసుగులో చేస్తున్న చర్యలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోలేదు: హర్షకుమార్ - Uttarandhra never asked the capital Harsh Kumar
congress leader Harsha Kumar:ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నడూ రాజధానిని కోరుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ పేర్కొన్నారు. సీఎం చెప్పడం వల్లే మంత్రులు రాజీనామా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నేతలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు కుట్రపన్నుతున్నారని హర్షకుమార్ విమర్శించారు.
congress leader Harsha Kumar
Last Updated : Oct 11, 2022, 10:32 AM IST