ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమగ్ర రాష్ట్రాభివృద్ధికే మూడు రాజధానులు' - రాజధాని అమరావతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్​లోనే అభివృద్ధి కేంద్రీకృతమైందని... భవిష్యత్తులో అలాంటిది జరగకూడదనే సీఎం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని మేకతోటి సుచరిత అన్నారు.

mekathoti sucharitha
మేకతోటి సుచరిత

By

Published : Dec 22, 2019, 4:57 PM IST

మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్​లోనే అభివృద్ధి కేంద్రీకృతమైందని వివరించారు. భవిష్యత్తులో అలాంటిది జరగకుండా సమగ్ర రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆమె విశాఖలో తెలిపారు. అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూమిని... అభివృద్ధి చేసి ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details