ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రమాదపు అంచున పేదల గూడు... రక్షించాలని గోడు - vizag hill station news

వర్షం వస్తే అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం భయపడుతూ గడుపుతుంటారు. కొండచరియలు ఎక్కడ మీద పడతాయోనని సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు.

కొండ ప్రాంతాలు

By

Published : Oct 26, 2019, 9:59 AM IST

Updated : Oct 26, 2019, 12:32 PM IST

విశాఖలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు.. కొండలపై గృహాలు నిర్మించుకున్న పేదల పాలిట ప్రమాదకరంగా మారాయి. ఏ సమయంలో ఏ ఇంటిపై కొండచరియ వచ్చి పడుతుందో తెలియక ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అరిలోవ నుంచి కైలాసగిరి వరకు... సింహాచలం నుంచి గాజువాక వరకు.. యారాడ నుంచి రుషికొండ వరకు అన్నిచోట్ల ఇదే సమస్య. కొండలపై నివాసాలు, ఆక్రమణలను జీవీఎంసీ అడ్డుకట్ట వేయలేకపోతోందనేది నిర్వివాదాంశం. పోనీ వర్షాల సమయంలోనైనా అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవటం, హెచ్చరికలు జారీ చేయడం లేదని స్థానికులంటున్నారు. నగర అభివృద్ధికి ఎంతో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... పేదలైన తమ రక్షణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. రక్షణ గోడలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని అంటున్నారు.

గిరులపై పేదల కష్టాలు
Last Updated : Oct 26, 2019, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details