ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో పింఛన్ల తొలగింపుపై లబ్దిదారుల ఆందోళన - pensioners protest in vizag

పెన్షన్ల జాబితాలో పేరు తొలగించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో బాధితులు నిరసన గళం విప్పారు. కారణం లేకుండా పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

pensioners-agitation-in-visakhaptnam
పింఛనుదారుల తొలగింపుపై విశాఖ లబ్దిదారుల ఆందోళన

By

Published : Feb 8, 2020, 9:53 AM IST

పింఛన్లు తొలగింపుపై వృద్ధులు, మహిళల ఆందోళన

అకారణంగా పెన్షన్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ విశాఖ జీవీఎంసీ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నిరసనకు దిగారు. వెంటనే తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీరికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మద్దతు తెలిపారు. అర్హులకులకు న్యాయం జరిగే పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ఆందోళన వద్దు...
పింఛన్లు తొలగింపుపై లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని వీఎంఆర్​డీఎ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తెలిపారు. అర్హులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని అన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details