విశాఖ ఉక్కును ప్రైవేటుకు ధారాదత్తం చేయడం వెనుక రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. పీసీసీ అధ్యక్షుడు శైలాజనాథ్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో వైకాపా నేతల ప్రమేయం ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చెప్పిన విషయాన్ని శైలజానాథ్ గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమా... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవమా అన్నది.. ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములను విల్లాలుగా మార్చారని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బంధాన్ని బయటపెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ దీర్ఘకాలికంగా పోరాడనుందని శైలజానాథ్ వెల్లడించారు.