విశాఖ జిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులతో మాట్లాడారు. తనపై విమర్శలు చేసే నాయకులు ఎదురుగా వచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రజలు మేల్కొంటున్నారని... వైకాపా సింహాసనం ఖాళీ చేయాలంటూ విమర్శించారు. రాజకీయ నాయకులంతా వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు.. తాను సినిమాలు చేస్తే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. కేసులు ఉన్నవారే.. తెగించి సమాజంలో తిరుగుతున్నప్పుడు.. ఆశయాలున్న తాము తిరిగితే తప్పేంటన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనతో గొడవ పెట్టుకుంటోందని... ప్రజల్లో బలం ఎవరికి ఉందో ఆలోచించండని జనసేనాని వ్యాఖ్యానించారు.
'151 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రండి.. చర్చిద్దాం' - గాజువాకలో పవన్ కల్యాణ్ పర్యటన
తనపై విమర్శలు చేసే నాయకులు ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం చేయండని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యాంగం గురించి తెలియకపోతే... 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఒకేసారి రండి.. నేను చెప్తానంటూ సవాల్ విసిరారు.
pawan-kalyan-in-gajuvaka