జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించనున్న సభకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభను నిర్వహించనున్నారు. 31వ తేదీన పవన్ విశాఖ చేరుకుంటారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకుని సభలో పాల్గొంటారు.
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోందని జనసేన తెలిపింది. ఈ అంశంపై తొలుత స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది పవన్ కల్యాణే అని చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని పవన్ తెలియజేశారని తెలిపింది. 34 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయిందనే విషయాన్ని అమిత్ షాకు చెప్పారని వెల్లడించింది.
Pawan kalyan: 31న విశాఖకు పవన్‌కల్యాణ్..ఉక్కు పరిరక్షణ సభకు హాజరు - విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తాజా వార్తలు
ఈ నెల 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించనున్న సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
Pawan kalyan