విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానాన్ని పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్. అకోశ్ బాజ్ పేయి (MP), జుగల్ కిషోర్ శర్మ (MP), లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ వేట్స్, కల్పనా శర్మ (IAS) అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ కమిటీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకళ, అధికారులు వారిని సాదరంగా స్వాగతించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
ఎంపీలు, ఉన్నతాధికారులకు క్షేత్ర మహత్యం, దేవస్థానం గురించిన విశేషాలను ఈవో సూర్యకళ వివరించారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ శిల్ప సంపద చూసి ఎంపీల కమిటీ సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యాన్ని కల్పించాలని సూచించారు.