ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Parade of Sails: విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్ - parade of sailsin vizag harbour

విశాఖ హార్బర్​లో పరేడ్ ఆఫ్ సెయిల్స్(parade of sails in vizag harbour)​ను నిర్వహించారు. ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణిం విజయ్ వర్ష్‌, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్
విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్

By

Published : Nov 25, 2021, 6:26 PM IST

Updated : Nov 25, 2021, 7:16 PM IST

స్వర్ణిం విజయ్ వర్ష్‌, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా.. తూర్పునౌకాదళం పరేడ్ ఆఫ్ సెయిల్స్​లను నిర్వహించింది. విశాఖ హార్బర్​లో ఏర్పాటు చేసిన ఈ పరేడ్​లో 45 బోట్లు పాల్గొన్నాయి. దాదాపు 75 మంది ఔత్సాహికులు ఈ పోటీలకు హాజరయ్యారు. దిల్లీకి చెందిన ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌, రియర్ అడ్మిరల్ జ్యోతిన్ రైనా ఈ పోటీలను ప్రారంభించారు. అసమాన ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. హబ్బీ కాట్, లేసర్ బహియా, లేసర్ స్టాండర్డ్, లేసర్ రేడియల్, ఎంటర్ప్రైస్, 29 ఇఆర్, బిక్ నోవా విండ్ సర్ఫర్లు, ఆప్టిమిస్ట్, సీ కాయక్స్ వంటి పడవలు ఈ పరేడ్​లో పాల్గొన్నాయి.

విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్
విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్
విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్
Last Updated : Nov 25, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details