విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెదేపా పాదయాత్ర చేపట్టింది. గాజువాక బీసీ రోడ్డు కూడలి వద్ద ఉన్నఅంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాదయాత్రను ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే కనుక.. వారికి బాసటగా నిలబడటానికి పాదయాత్ర చేస్తున్నట్టు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటీకరణ నిలిచే వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు అండగా పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ.. నిర్వాసితులకు అండగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు. ప్రైవేటీకరణ నిలిచే వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పల్లా శ్రీనివాసరావు
Last Updated : Jul 30, 2021, 2:06 PM IST