ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Outsourcing Employees Protest: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. కాన్వాయ్ మార్గంలో మెరుపు ధర్నా! - సీఎం జగన్​ కాన్వాయ్ అడ్డగింత

outsourcing employees protest: విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్​కు పొరుగుసేవల సిబ్బంది నుంచి నిరసన సెగ తగిలింది. బీచ్ రోడ్​లో కురుపాం సర్కిల్ వద్ద.. సదరు సిబ్బంది ఒక్కసారిగా మెరుపు ధర్నాకు యత్నించారు.

Outsourcing Employees Protest
Outsourcing Employees Protest

By

Published : Dec 17, 2021, 8:11 PM IST

అడ్డుకుంటున్న పోలీసులు

outsourcing employees protest: విశాఖ పర్యటనలో సీఎం జగన్ వచ్చే మార్గంలో పొరుగుసేవల సిబ్బంది మెరుపు ధర్నాకు ప్రయత్నించారు. బీచ్ రోడ్‌లోని కురుపాం సర్కిల్ వద్ద తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు రహదారి మీదకు రాగా.. పోలీసులు వారిని ఆరెస్ట్ చేశారు. నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.

పోలీసుల అదుపులో ఆందోళనకారులు

కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక పని చేస్తే.. విధుల్ని నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆరెస్ట్ చేయడాన్ని నేతలు ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details