విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌కు చెందిన 300 ఎకరాల్లో అతిథి గృహానికి 30 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థల కేటాయింపుపై రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థల కేటాయింపులు, ఇతర అంశాల్లో త్వరితగతిన ముందుకెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు.
విశాఖలో అతిథి గృహానికి స్థలం కేటాయింపుపై ఉత్తర్వులు - ap govt GOs latest news
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఉత్తర్వులు