ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సముద్రసేతు... యుద్ధనౌకల్లో మాతృదేశానికి ! - ఆఫరేషన్ సముద్రసేతు వార్తలు

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లో దేశానికి తీసుకువస్తున్నట్లు నావికాదళ వర్గాలు తెలిపాయి. సముద్రసేతు పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తరలిస్తున్నారు. ఐఎన్​ఎస్ జలాశ్వలో 698 మందిని స్వదేశానికి తరలిస్తున్నట్లు నౌకదళ అధికారులు తెలిపారు.

సముద్రసేతు... యుద్ధనౌకల్లో మాతృదేశానికి !
సముద్రసేతు... యుద్ధనౌకల్లో మాతృదేశానికి !

By

Published : May 9, 2020, 11:33 AM IST

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ‘సముద్ర సేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మఘర్‌ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు వెల్లడించాయి.

తొలివిడతగా గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ వెయ్యి మందిని దేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నాయి. ఐఎన్‌ఎస్ జలాశ్వలో 698 భారతీయులను స్వదేశానికి తరలించారు. ఐఎన్‌ఎస్ జలాశ్వ నౌక కేరళలోని కొచ్చికి రానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి :ఆపద ఎక్కడుంటే.. తస్లీమా అక్కడుంటుంది

ABOUT THE AUTHOR

...view details