ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rushikonda: రుషికొండపై నిర్మాణానికి ‘ప్లాను’ దరఖాస్తు - విశాఖలోని రుషికొండపై నిర్మాణానికి ప్లాను దరఖాస్తు

రుషికొండపై వివాదాస్పద నిర్మాణానికి సంబంధించి ఈనెల 13న అరవింద్‌ ముద్రగడ అనే వ్యక్తి పర్యాటకశాఖ తరఫున ఆన్‌లైన్‌లో ప్లాను కోసం దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తును పరిశీలించి, ఇంకా సమర్పించాల్సిన పత్రాలు, ఆస్తిపన్ను బకాయిలు తదితర (షార్ట్‌ ఫాల్స్‌) వివరాలను తిరిగి జీవీఎంసీ కోరనుంది.

Rushikonda
రుషికొండ

By

Published : Jul 30, 2022, 10:23 AM IST

Rushikonda: విశాఖ నగరంలోని రుషికొండపై వివాదాస్పద నిర్మాణానికి సంబంధించి ఈనెల 13న అరవింద్‌ ముద్రగడ అనే వ్యక్తి పర్యాటకశాఖ తరఫున ఆన్‌లైన్‌లో ప్లాను కోసం దరఖాస్తు చేశారు. దీని కోసం జీవీఎంసీకి రూ.19.05 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తును పరిశీలించి, ఇంకా సమర్పించాల్సిన పత్రాలు, ఆస్తిపన్ను బకాయిలు తదితర (షార్ట్‌ ఫాల్స్‌) వివరాలను తిరిగి జీవీఎంసీ కోరనుంది. ప్రస్తుత నిర్మాణానికి సంబంధించిన పత్రాలను పర్యాటకశాఖ సమర్పిస్తే జీవీఎంసీ పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మరో పక్క ఇక్కడ నిర్విరామంగా పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఆన్‌లైన్‌లో ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసిన వెంటనే బిల్డింగ్‌ అప్లికేషన్‌ నంబరు వస్తుంది. ప్లాన్‌ రాకపోయినా అప్లికేషన్‌ నంబరు ఆధారంగా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details