ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఓహెచ్​ఈ ప్రారంభం - విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఓహెచ్​ఈ ప్రారంభం వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఓహెచ్​ఈ(ఓవర్ హెడ్ ఎక్విప్​మెంట్)ని ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ పి.కె రధ్, వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఓహెచ్​ఈని లాంఛనంగా ఆరంభించారు. 9.33 కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్​కు విద్యుద్దీకరణతో ప్లాంట్​లో అంతర్గత రైల్వే మరింత పటిష్టంగా తయారైందని పి.కె రధ్ అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఓహెచ్​ఈ ప్రారంభం
విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఓహెచ్​ఈ ప్రారంభం

By

Published : Nov 11, 2020, 10:33 PM IST

స్టీల్ సామగ్రిని సెంట్రల్ డిస్పాచ్ యార్డు నుంచి స్టీల్ ఏరియా వరకు వేగంగా రవాణాకు ఓహెచ్​ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని, ఈ లైన్ విద్యుద్దీకరణ పనిలో సామర్థ్యం పెరుగుదల సాధ్యపడుతుందన్నారు. 25 కేవీ ఏసీ పవర్డ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ ద్వారా విద్యుత్తు సరఫరా కోసం సెంట్రల్ డిస్పాచ్ యార్డు నుంచి 255 పోల్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల రైళ్ల ద్వారా నేరుగా ప్లాంట్ యార్డులోనే లోడ్ అయిన సరకు దేశంలో ఏ ప్రాంతానికైనా మధ్యలో ఎక్కడా మార్చకుండా పంపేందుకు వీలవుతుంది. ఇది రవాణాలో మరింత ముందడుగుగా ఉంటుందని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details